ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి.. ఆకునూరి మురళి సూచన

by Gantepaka Srikanth |

విద్యార్థులకు మెరుగైన అభ్యాస ఫలితాలను అందించడానికి ఉపాధ్యాయుల నిరంతర అభివృద్ధి, సహకార ప్రయత్నాలు చాలా ముఖ్యమని తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు.

ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి.. ఆకునూరి మురళి సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులకు మెరుగైన అభ్యాస ఫలితాలను అందించడానికి ఉపాధ్యాయుల నిరంతర అభివృద్ధి, సహకార ప్రయత్నాలు చాలా ముఖ్యమని తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు. విద్యార్థులను చురుగ్గా తయారు చేయాలంటే టీచర్లు ప్రొఫెషనల్‌గా ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించాలని, కొత్త మెలవకువలు నేర్చుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయ విద్యపై శుక్రవారం తెలంగాణ విద్యా కమిషన్ (టీఈసీ) సమగ్ర సంప్రదింపుల సదస్సును ఎస్ సీ ఈఆర్టీ కార్యాలయంలో నిర్వహించింది. కమిషన్ ఛైర్మన్ మురళి అధ్యక్షతన జరిగిన సదస్సుకు విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, ఉపాధ్యాయ శిక్షణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య ప్రస్తుత స్థితి, భవిష్యత్తు దిశపై చర్చించారు.

Next Story