- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీచర్ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్టు ఆయనకే!
ఎమ్మెల్సీ ఎన్నికలలో హర్ష వర్ధన్ రెడ్డికే కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికలలో హర్ష వర్ధన్ రెడ్డికే కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్గౌడ్స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘం నాయకుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించేందుకు కృషి చేస్తుందన్నారు.
హైకమాండ్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హర్షవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయ, విద్య సంబంధ సమస్యలపై 20 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. దీంతోనే ఆయనను గెలిపించేందుకు మండలి ఎన్నికల పరిధిలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఆయన విజయానికి సమిష్టిగా కృషి చేస్తుందని పిలుపునిచ్చారు. అభ్యర్ధిని గెలిపించేందుకు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తామన్నారు.
Also Read..






