- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Teachers locked : తరగతి గదిలోనే విద్యార్థి..తాళం వేసి వెళ్లిన ఉపాధ్యాయులు!
విద్యార్థి తరగతి గది(Student In The Classroom)లోనే ఉండగానే ఉపాధ్యాయులు(Teachers) తాళం(Locked) వేసి వెళ్లిపోయిన తీరు సర్కారు బడుల నిర్వహణ తీరుపై విమర్శలు రేకెత్తిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థి తరగతి గది(Student In The Classroom)లోనే ఉండగానే ఉపాధ్యాయులు(Teachers) తాళం(Locked) వేసి వెళ్లిపోయిన తీరు సర్కారు బడుల నిర్వహణ తీరుపై విమర్శలు రేకెత్తిస్తుంది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని శాయిన్ పేట ప్రాథమికోన్నత పాఠశాల సమయం అయిపోగానే విద్యార్థులందరూ ఇళ్లకు వెళ్లిపోగా ఉపాధ్యాయులు గదులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అయితే ఒకటో తరగతి(1st Class) విద్యార్థి శరత్(Sharath) నిద్రపోవడంతో తరగతి గదిలోనే ఉండిపోయాడు.
సాయంత్రం 3:30గంటలకు ఇంటికి రావాల్సి ఉండగా.. 4 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తండ్రి మల్లేష్ పాఠశాలకు వెళ్లి వెతికాడు. ఈ క్రమంలో ఓ తరగతి గది కిటికి తెరచి చూడగా శరత్ నిద్రించి కనిపించాడు. వెంటనే గది తాళం పగులగొట్టి కుమారుడిని బయటకు తీసుకువచ్చాడు. ఉపాధ్యాయుల నిర్వాకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేష్(hm Ganesh) వివరణ ఇస్తూ శరత్ తరగదిలో నిద్రిస్తు్న్న విషయాన్ని గమనించలేదని, ఇకముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూస్తామన్నారు.
ప్రతి రోజు 3గంటలకే స్టడీ ఆవర్ నిర్వహించి విద్యార్థులను తరగతి గదుల బయట కూర్చొబెడుతామని..పాఠశాల సమయం అయిపోగానే వారు ఇళ్లకు వెళ్లిపోతారని..శరత్ కూడా అలాగే వెళ్లి ఉండవచ్చనుకుని..అతను తరగతి గదిలో నిద్రిస్తుండటాన్ని ఉపాధ్యాయులు గమనించలేదని తెలిపారు.






