- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ ఉ.11 గంటలకు టెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ టెట్ ( TET ) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ టెట్ ( TET ) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సరిగ్గా ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా ( Yogitha Rana).. టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
జూన్ మాసం 18వ తేదీ నుంచి ఆ నెల 30వ తేదీ వరకు టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షలు (Teacher Eligibility Test) నిర్వహించారు. ఇక జూలై 5వ తేదీన టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ కూడా విడుదల చేసి... అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది విద్యాశాఖ. ఇక ఇవాళ తుది కీ తో పాటు పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక ఈ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష ఫలితాలను https://tgtet.aptonline.in/tgtet/ లేదా https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్సైట్ ల ద్వారా తెలుసుకోవచ్చు.






