లోక్‌సభ ఎన్నికల ముందు టీ కాంగ్రెస్ సరికొత్త వ్యూహం!

by Disha Web Desk 14 |
లోక్‌సభ ఎన్నికల ముందు టీ కాంగ్రెస్ సరికొత్త వ్యూహం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ పార్టీ వ్యూహలు రచిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలకి ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు టీ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ఖమ్మం లేదా భువనగిరి లేదా నల్గొండ నుంచి లోక్ సభ బరిలో రాహుల్ గాంధీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారని సమాచారం. దీనికి రాహుల్ గాంధీ అంగీకరించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాగా, తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇటీవల సోనియా గాంధీని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఖమ్మం పార్లమెంట్ నుంచి బరిలో నిలపాలని భావించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీగా ఎన్నిక అయ్యారు. మరోవైపు సోనియా పోటీ చేసిన రాయ్ బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేయనున్నట్లు తెలిసింది. దీంతో సోనియాకు బదులు రాహుల్‌ను తెలంగాణ నుంచి పోటి చేయిస్తే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ వర్గాలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

కాగా, రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోక్ సభ ఎన్నికల్లో మరోసారి సౌత్ నుంచి రాహుల్ పోటీలో ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీకి సంబంధించి కాంగ్రెస్ వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు వయనాడ్ నుంచి రాహుల్ ఎంపీగా ఉండగా ఇక్కడి నుంచి సీపీఐ ఇటీవల అభ్యర్థిని ప్రకటించింది. ‘ఇండియా’ కూటమి సీట్ల సర్దుబాట్లు చర్చలు సాగుతుండగానే సీపీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డీ. రాజా సతీమణి యాని రాజాను అక్కడి నుంచి క్యాండిడేట్‌గా అనౌన్స్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed