- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
TRS ప్రభుత్వానికి TDP మహిళా నేతల హెచ్చరిక
X
దిశ, తెలంగాణ బ్యూరో: త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ బ్రాందీ దుకాణంగా మార్చి వేశారని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాళ్లు మండిపడ్డారు. మద్యం అమ్మకాలను నియంత్రించాలని, గంజాయి విక్రయాలపై ఉక్కపాదం మోపాలని, లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లో ఎక్సైజ్ కమిషనర్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న లైంగికదాడులు కూడా మద్యం మత్తులోనే జరుగుతున్నాయన్నారు. అనంతరం హైదరాబాద్ డీసీపీ, ఏసీపీలకు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి షకీలా రెడ్డి, కార్యదర్శులు అన్నపూర్ణ, ప్రతిభ, సూర్యదేవర లత, పాల్గొన్నారు.
Advertisement
Next Story