BJP : ప్రకాష్ రాజ్‌కు తెలంగాణ బీజేపీ మాస్ కౌంటర్

by Muthe.Rajitha |

BJP : ప్రకాష్ రాజ్‌కు తెలంగాణ బీజేపీ మాస్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్ : నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) కు తెలంగాణ బీజేపీ(Telangana BJP) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ ను బురదలో పందితో పొలుస్తూ పోస్ట్ షేర్ చేసింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటనలో తన నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తుందని తెలపగా.. దానిని విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ ప్రధాని నరనరాల్లో ఉండేది దేశభక్తి కాదని.. ఆయన నరనరాల్లో ప్రవహించేది ఎన్నికలేనని ఓ పోస్ట్ షేర్ చేశారు. ప్రకాష్ రాజ్ విమర్శలపై బీజేపీ నాయకులు, శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. అయితే తెలంగాణ బీజేపీ ప్రకాష్ రాజ్ ను బురదలో పందితో పోలుస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది.

ఆయన నటించిన ఒక్కడు సినిమాలోని ఓ సన్నివేశంలో బురదలో పడే దృశ్యాన్ని, పందితో జోడించి.. 'రెండూ ఒకటే' అంటూ టీ బీజేపీ సోషల్ మీడియాలో వదిలింది. అది కాస్త శోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే బీజేపీ సపోర్టర్స్ ఆయనను దేశద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ పోస్టర్ సరిగ్గా సరిపోయిందని అంటుండగా.. మరికొందరు మాత్రం ఆయన అభిప్రాయం స్వేచ్ఛగా చెప్పడంలో తప్పేం ఉందని ప్రశ్నిస్తున్నారు.

Next Story