- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నేను నిఖార్సైన మొగోడిని’.. మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
by Gantepaka Srikanth |
స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరి రాజీనామా చేయక తప్పదని అన్నారు. శ్రీహరి తాటాకు చప్పుళ్లకు ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పారు. ‘నేను నిఖార్సైన మొగోడిని.. పక్కా స్థానికుడిని’ అని రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. నిన్న కూడా కడియంపై రాజయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిగ్గు, శరం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన నీవు అధికార దాహంతో కాంగ్రెస్‌లో చేరావని మండిపడ్డారు. ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోవడానికి భయపడి ఇప్పటి వరకు స్పీకర్‌కు వివరణ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.
Next Story






