కల్వకుంట్ల కవితపై తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్!

by velandi.Saikiran |

కల్వకుంట్ల కవితపై ( Kalvakuntla KAVITHA) మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ( Tatikonda Rajaiah) హాట్ కామెంట్స్ చేశారు.

కల్వకుంట్ల కవితపై తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్!
X

దిశ, వెబ్ డెస్క్ : కల్వకుంట్ల కవితపై ( Kalvakuntla KAVITHA) మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ( Tatikonda Rajaiah) హాట్ కామెంట్స్ చేశారు. కల్వకుంట్ల కవిత ఇష్యూ టీ కప్పులో తుపాను లాంటిదని వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ... కేసీఆరే ( kcr ) నా దేవుడు అని కవిత చెప్పారని గుర్తు చేశారు. మొదటి నుంచి జాగృతికి.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా కవిత ఉన్నారన్నారు.

కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారని పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇందులో ఎలాంటి ఆందోళన, తప్పుడు ప్రచారాలు వద్దని కోరారు. ఇది ఇలా ఉండగా... గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ గురించే జోరుగా చర్చ జరుగుతుంది. మొట్టమొదటగా కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆమె బహిరంగ లేఖ రాయడం... వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

గులాబీ పార్టీలో ఉన్న లొసుగులను ఆమె బయట పెడుతూ లేఖ రాశారు. దీంతో అసలు పంచాయితీ మొదలైంది. అంతేకాదు చిట్ చాట్ లో గులాబీ లో ఉన్న దెయ్యాల గురించి అలాగే కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. తాజాగా... తెలంగాణ రాష్ట్ర జాగృతి కోసం... కొత్త కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేశారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా... కేసీఆర్ అడుగుజాడల్లోనే తాను కూడా నడుస్తానని.. కల్వకుంట్ల కవిత ప్రకటించారు.

Next Story