- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరునూరైన 6 నెలల్లో ఉప ఎన్నికలు తథ్యం : తాటికొండ రాజయ్య
పార్టీ ఫిరాయించిన(Party Defection) తెలంగాణకు 10 ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Suprem Court) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయించిన(Party Defection) తెలంగాణకు 10 ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Suprem Court) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంతీర్పుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah) స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని తెలిపిన రాజయ్య.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పును అనుసరించి మూడు నెలలలోపు స్పీకర్ చర్యలు తీసుకొని. అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
అలా చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఆయా ఎమ్మెల్యేలు 6 ఏళ్ల వరకు పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. తరువాత 6 ఏండ్ల వరకు వారంతా వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి కూడా అర్హత కోల్పోతారని అన్నారు. ఆరు నూరైనా 6 నెలల్లో ఉప ఎన్నికలు(By-Poles) వస్తాయని, ప్రజల నిర్ణయాన్ని పక్కన పెట్టి అధికారపార్టీలోకి వెళ్ళిన నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఉప ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ గెలవడం ఖాయం అని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు.






