- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఇక్కడ జ్యూస్ తాగుతున్నారా? మీ ఆరోగ్యం మటాష్!
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల వేడిని తట్టుకునేందుకు చాలా మంది జ్యూస్ సెంటర్లకు వెళ్లి జ్యూస్ లు తాగుతూ ఉంటారు.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల వేడిని తట్టుకునేందుకు చాలా మంది జ్యూస్ సెంటర్లకు వెళ్లి జ్యూస్ లు తాగుతూ ఉంటారు. అయితే బయట జ్యూస్ తాగడం వల్ల ఎండనుండి ఉపశమనం లభిస్తుందేమో కానీ ఆరోగ్యం మాత్రం పాడవుతుంది. చాలా జ్యూస్ సెంటర్లలో పరిశుభ్రత లోపిస్తుంది. కాబట్టి వెళ్లిన తరవాత అక్కడ వాతావరణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లోని కొన్ని జ్యూస్ సెంటర్లలో తనిఖీలు చేయగా అక్కడ వాతావరణం చూసి షాక్ అయ్యారు. అత్యంత రద్దీగా ఉండే అమీర్ పేటలోని పలు జ్యూస్ సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.
జ్యూస్ ల తయారీలో ఎక్స్పైర్ అయిన ఫుడ్ కలర్స్ వాడటం గుర్తించారు. అదే విధంగా కుళ్లిపోయిన పండ్లతో జ్యూస్ లు తయారు చేయడం, పండ్లు నిల్వ ఉంచే ఫ్రిడ్జ్ లు చాలా అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. జ్యూస్ తయారు చేసే వారు గుట్కాలు వేసుకుని నములుతూ అపరిశుభ్రంగా గ్లౌజులు లేకుండా జ్యూసులు తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్ని ఆహార పదార్థాలపై ఫుడ్ లేబుల్స్ లేవని తెలిపారు. పండ్లపై, జ్యూస్ తయారీ చేస్తున్న పాత్రలపై ఈగలు వాలుతున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్స్‌లో సైతం షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. తమదైన స్టైల్‌లో కామెంట్లు పెడుతున్నారు.






