- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Stalin: సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌కు తమిళనాడు CM స్టాలిన్ లేఖ
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ (Tamil Nadu CM Stalin) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం డీలిమిటేషన్ ప్రవేశపెడితే తమ హక్కుల్ని కాలరాస్తాయని, రాష్ట్రాల్లోని ఎంపీ సీట్లు తగ్గుతాయని స్టాలిన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జనాభా నియంత్రణలో మెరుగ్గా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని స్టాలిన్ చెబుతున్నారు. ఇందులో భాగంగా డీలిమిటేషన్‌కి వ్యతిరేకంగా జాయింట్ యక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 7 రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ లేఖలు రాశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామిలను ఆహ్వానించారు.
అదేవిధంగా వైఎస్ఆర్‌సీపీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, తెలంగాణ, ఏపీ కాంగ్రెస్, టీడీపీ, జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు పార్టీల చీఫ్‌లకు లేఖలు రాశారు. మార్చి 22న చెన్నైలో మొదటి జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరంతా జేఏసీలో చేరాలని, పార్టీలోని ముఖ్య నేతలను ప్రతినిధులుగా ఈ సమావేశానికి పంపాల్సిందిగా కోరారు. ఈ వివరాలను తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం స్టాలిన్ పంచుకున్నారు.






