- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ సర్కార్ కంటే తాలిబన్ల సర్కార్ నయం.. ప్రభుత్వ తీరు దుర్మార్గం: ఆకునూరి మురళి
బీఆర్ఎస్ ప్రభుత్వంపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి మరోసారి విమర్శలు గుప్పించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వంపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ తాలిబన్ల పరిపాలనలో ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వం కంటే దారుణంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం వారి బడ్జెట్ లో ప్రభుత్వ విద్యకు 15.3 శాతం నిధులు కేటాయించారని, అదే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యకు బడ్జెట్‌లో కేవలం 6.4 శాతం నిధులు మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. ఇది దుర్మార్గమని మండిపడ్డారు. విద్యా అనేది సమాజ అభివృద్ధికి పునాది వంటిదని అందువల్ల రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు 20 శాతం కేటాయింపులు ఉండాలని సూచించారు. ఆడపిల్లల విద్య, మహిళల పట్ల తాలిబన్ల కిరాతక ప్రవృత్తిని ఖండిస్తూనే అక్కడి బడ్జెట్ లో విద్యాశాఖకు 15.3 శాతం నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Read More: టీఎస్ ఐపాస్ ద్వారా వినూత్న పరిశ్రమలకు పర్మిషన్స్ : KTR






