తడబడిన తలసాని! లైవ్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత పేరు మర్చిపోయిన ఎమ్మెల్యే వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-07-20 06:26:45  IST  )

సొంత పార్టీ నేతల పేర్లు మర్చిపోతున్నారని బీఆర్ఎస్ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.

తడబడిన తలసాని! లైవ్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేత పేరు మర్చిపోయిన ఎమ్మెల్యే వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సొంత పార్టీ నేతల పేర్లు మర్చిపోతున్నారని బీఆర్ఎస్ నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Talasani Srinivas Yadav)పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తడబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట (viral) వైరల్‌గా మారింది. ఇటీవల మల్కాజిగిరి పరిధిలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ నేత మేకల రాము యాదవ్‌ను బీఆర్ఎస్ నాయకులు (BRS leaders) పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. లైవ్‌లో మాజీ స్పీకర్, సీనియర్ బీఆర్ఎస్ నేత మధుసూధనా చారిని వేణుగోపాల చారిగా చేశారు. ఇప్పుడు మా పెద్దలు వేణుగోపాల చారి గారు మాట్లాడుతారు.. అని తలసాని అనగానే పక్కన ఉన్న ఇతర నేతలు మాజీ స్పీకర్ పేరును గుర్తుకు చేస్తారు. అప్పుడు రెండోసారి తలసాని.. శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూధన చారి అంటూ కరెక్ట్‌గా చెబుతారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జోగు రామన్న, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు ఉన్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి

Next Story