పతంగి ఎగరాలి.. ప్రమాదం లేకుండా

by Ajay Maddhiboyina |

సంక్రాంతి పం డుగ సందర్భంగా వరుస సెలవులు ఉండ టంతో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తారు.

పతంగి ఎగరాలి.. ప్రమాదం లేకుండా
X

దిశ, డైనమిక్ బ్యూరో : సంక్రాంతి పం డుగ సందర్భంగా వరుస సెలవులు ఉండ టంతో పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తారు. అయితే పతంగులు ఎగురవేసే ముందు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇ వ్వాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ము షారఫ్ ఫరూఖీ సూచించారు. బుధవారం ఆయన సూపరింటెండింగ్ ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ రోజుల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా చ ర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. తెగిప డిన పతంగులు, మాంజాల ప్రభావం అధి కంగా ఉన్న ప్రాంతాల్లో 6 నుంచి 18 అ డుగుల వరకు పొడిగించగల అత్యాధునిక రంపం మెషిన్‌లను అందుబాటులో ఉంచి నట్లు తెలిపారు. ప్రత్యేక ఇన్సులేషన్‌తో అ మర్చిన ఈ మెషిన్‌ల ద్వారా విద్యుత్ సరఫ రా నిలిపివేయకుండానే విద్యుత్ లైన్లపై పడి న పతంగుల అవశేషాలను సురక్షితంగా తొలగించవచ్చని పేర్కొన్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి..

3విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలి.

3కాటన్, నైలాన్ లేదా లెనిన్‌తో తయారైన మాంజాలు మాత్రమే ఉపయోగించాలి. మెటాలిక్ మాంజాలు వాడొద్దు.

3పొడి వాతావరణంలోనే ఎగురవేయాలి.

3పతంగులు విద్యుత్ లైన్లపై లేదా ఇతర విద్యుత్ పరికరాలపై పడితే వాటిని వదిలేయాలి. లాగడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

3బాల్కనీలు లేదా గోడలపై నుంచి

ఎగురవేయరాదు.

3పతంగులు ఎగురవేస్తున్న సమయంలో పిల్లలపై పెద్దలు

ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

3ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే సమీప విద్యుత్ కార్యాలయానికి లేదా 1912 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. అలాగే www.tgsouthernpower.org వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

Next Story