Undavalli : విభజన అన్యాయాలను సరిదిద్దే బాధ్యత తీసుకోండి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉండవల్లి లేఖ

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-10 11:17:00  IST  )

2014లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విభజన(Division)కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar)బహిరంగ లేఖ(Open letter)రాశారు.

Undavalli : విభజన అన్యాయాలను సరిదిద్దే బాధ్యత తీసుకోండి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉండవల్లి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : 2014లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విభజన(Division)కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar)బహిరంగ లేఖ(Open letter)రాశారు. మీ శ్రేయోభిలాషి అంటూ ఉండవల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు లేఖ నాలుగు పేజీల లేఖ రాశారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ శ్రద్ధ తీసుకోవాలని లేఖలో అరుణ్ కుమార్ కోరారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కొలిక్కి తీసుకురావాలని కోరారు. పార్లమెంట్ లో రాష్ట్ర విభజన జరిగిన తీరును ఉండవల్లి తన లేఖలో ప్రస్తావిస్తూ ఆనాటి ఘటనలను గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన విషయంపై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుస్తూనే ఉందని.. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదన్నారు. కౌంటర్ తో పాటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరూ తర్వాత మనకు జరిగిన అన్యాయం విషయమై చర్చకు నోటీసులు ఇప్పించాలని గతంలో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని..అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారని...కారణాలేమైనా అది జరుగలేదని లేఖలో పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మూడేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వం నా వాదనకు మద్ధతుగా కౌంటర్ దాఖలు చేసిందన్నారు. పార్లమెంటులోనే ప్రధాని మోడీ, అమిత్ షాలు రాష్ట్ర విభజన సక్రమంగా సాగలేదని వ్యాఖ్యానించిన అంశాలను లేఖలో ఉండవల్లి ఉటంకించారు.

విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పడు తెలంగాణలో, సహకరించిన బీజేపీ కేంద్రంలో ఉన్నందునా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయమని గుర్తు చేశారు. అందుకే మీరు ఈ విషయమై శ్రద్ధ తీసుకుని.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరూ తర్వాత మనకు జరిగిన అన్యాయం విషయమై చర్చకు నోటీసులు ఇప్పించాలని.. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని ఉండవల్లి తన లేఖలో పవన్ ను కోరారు.

Next Story