- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి.. సీపీఐ నారాయణకు ఎమ్మెల్సీ అద్దంకి కౌంటర్
హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరుగుతోన్న మిస్ వరల్ట్ పోటీలు (Miss World Pageants) రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరుగుతోన్న మిస్ వరల్ట్ పోటీలు (Miss World Pageants) రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అందాల భామల వెనుక అధికారులు, మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయారని.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచుకుండా ఇలా మిస్ వరల్డ్ పోటీలకు రూ.కోట్లలో ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందాల పోటీల విషయంలో మంత్రులు పాల్గొన్నారన్న విమర్శలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. శాఖ పరమైన సంబంధాలు ఉన్న అధికారులు ఆ ఈవెంట్‌లో తప్పక పాల్గొనాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. మంత్రులు, అధికారులపై నారాయణ చేసిన వ్యాఖ్యలు బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) ఇచ్చే స్టేట్‌మెంట్లకు ఊతమిచ్చేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నారనే విషయాన్ని అన్ని పార్టీలు గమనించాలని అద్దంకి దయాకర్ అన్నారు.






