- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకునాలని జాతీయ మానవ హక్కుల సంఘం సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. తరచుగా వస్తున్న పత్రిక కథనాలను ఆధారంగా చేసుకొని జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకునాలని జాతీయ మానవ హక్కుల సంఘం సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. తరచుగా వస్తున్న పత్రిక కథనాలను ఆధారంగా చేసుకొని జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. నర్సింగ్ కళాశాలల్లో సరైనా వసతులు, అధ్యాపకులు లేకుండా మధ్యవర్తుల ద్వారా అక్రమంగా అధికారులకు లక్షల రూపాయల లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒకచోట పర్మిషన్ తీసుకొని మరోచోట కళాశాల ఏర్పాటు చేయడం, ఒకే భవనంలో 8 కళాశాలలను ఏర్పాటుకు అనుమతించడం లాంటి సంఘటనలపై ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడంతో పాటు కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమే జారీ చేసి చేతులు దులుపుకోవడం లాంటి సంఘటనలపైన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కళాశాలల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి పూర్తి విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని విద్యార్థులకు విద్యా హక్కు ప్రకారం నాణ్యమైన విద్యను అందించే విధంగా చొరవ తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల సంఘం... విద్యార్థుల విద్యా హక్కులకు భంగం కలిగిస్తున్న ఈ సంఘటనపై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, రిజిస్ట్రార్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ కు తక్షణమే విచారణ చేపట్టి అనుమతి లేని కళాశాలలు, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకునాలని ఆదేశించింది. ఏం చర్యలు తీసుకున్నారనే నివేదికను నాలుగు వారాల్లోపు జాతీయ మానవ హక్కుల సంఘానికి నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది.






