- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో పరిస్థితి ఏంటి..? టీ-కాంగ్రెస్ నేతలను రాహుల్ ఆరా
by Satheesh |
హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణపై దృష్టి సారించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు తెలంగాణపై దృష్టి సారించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో గ్రౌండ్ రియాల్టీపై టీ-కాంగ్రెస్ నేతల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా తాజ్ కృష్ణ హోటల్‌లో రాహుల్ గాంధీ, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో పలువురు టీకాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు మరి కొంత మంది రాష్ట్ర నేతలు రాహుల్, డీకేతో మాటలు కలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రాజకీయ వాతావరణం, పార్టీ పరిస్థితిపై రాహుల్, డీకే తెలంగాణ నేతలను ఆరా తీసినట్లు సమాచారం.
Next Story






