- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు బంధు దుమారం.. సీఈవోకు మరోసారి టీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందువల్లే రైతుబంధును నిలిపివేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఫేక్ లెటర్

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని.. అందువల్లే రైతుబంధును నిలిపివేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఫేక్ లెటర్ సృష్టించి బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని టీకాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లేఖల వల్లే రైతుబంధు ఆగిందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ఇవాళ టీకాంగ్రెస్ నేతలు సీఈవో వికాస్ రాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతుబంధును ఆపాలని నేను కానీ టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కానీ ఎక్కడా ఫిర్యాదు చేయలేదన్నారు.
రైతుబంధు ఆపాలని రేవంత్ రెడ్డి ఈసీకి లేఖ రాసినట్లు ఫేక్ లెటర్ సృష్టించారని.. ఈ నకిలీ లేఖను సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్ వల్లే రైతుబంధు ఆపారని బీఆర్ఎస్ నేతలు చెప్పడం దురదృష్టకరమన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను నిలదీయాలన్నారు. రైతుబంధు డబ్బుల జమ విషయాన్ని ప్రచారంలో వాడుకోరాదని మాత్రమే తాము కోరామన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావును నిలదీయాలన్నారు.






