- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ పోజులు కోసం తెలంగాణ డబ్బులు పంజాబ్‍లో పంచలేదా? కేటీఆర్‍కు కాంగ్రెస్ కౌంటర్
కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి లేదంటే ఇంకో రకంగా స్పందించాల్సి వస్తుందని కాంగ్రెస్ హెచ్చరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుబంధు పథకం బంద్ చేసి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉండగా ప్రభుత్వ నిధులను దుబారా చేశారని గవర్నమెంట్ సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసేందుకు వేరే రాష్ట్రాల వారిని ఫ్లైట్స్ లో రప్పించారని మండిపడ్డారు. కేసీఆర్ ఫోజులు కొట్టేందుకు తెలంగాణ డబ్బులను పంజాబ్‍లో పంచారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ చిన్నాభిన్నం చేసి వెళ్లిపోయారన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని లేదంటే ఇంకో రకంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు.
సీఎం సహనంతో ఉన్నారు:
బీఆర్ఎస్ ఇంత చిల్లరగా ఉన్నా సీఎం ఓపికగా ఉంటున్నారని ఇంత ఓపికగా ఉంటున్న రేవంత్ రెడ్డికి దండం పెట్టాలన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి దోచి పెట్టారని బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావు, కవిత బంధులు ఉండేవని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో కేటీఆర్ దిట్ట అని నిజాలను అబద్ధాలుగా మార్చడం కేటీఆర్‍కు అలవాటేనన్నారు. మీడియాకి హెడ్ లైన్స్ కోసమే కేటీఆర్ తాపత్రయం అంతా అని విమర్శలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి కానీ పచ్చి అబద్ధాలను కేటీఆర్ ప్రజలపై రుద్దుతున్నారన్నారు. ప్రధానుల కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదని రాహుల్ గాంధీకి ఆస్తులు కావాలంటే తెలంగాణ కార్యకర్తలు తలా కొంచెం వేసుకుంటే రూ.1000 కోట్లు అవుతాయని రేవంత్ రెడ్డి చెబితే ఈ మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ అబద్ధాలను నిజాలుగా వక్రీకరిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు.






