T Congress: దొంగే దొంగా.. దొంగా.. అన్నట్టుంది.. చార్జిషీట్లపై సామా రామ్మోహన్

by Ramesh Goud |

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏడాది పాలనపై కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

T Congress: దొంగే దొంగా.. దొంగా.. అన్నట్టుంది.. చార్జిషీట్లపై సామా రామ్మోహన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏడాది పాలనపై కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ.. ఏడాది పాలనలో వైఫల్యాలపై చార్జీషీట్లు(Charge Sheets) విడుదల చేశాయి. ఈ చార్జీ షీట్లపై కాంగ్రెస్ నాయకులు వారి స్టైల్లో సమాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) నాయకుల చార్జీషీట్లపై కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్(Congress Media Committee Chairman) సామా రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ఏడాది పాల‌న.. ఎడ‌తెగ‌ని వంచ‌న అని బీఆర్ఎస్, హ‌రీష్ రావు(Harish Rao) హైద‌రాబాద్ లో చార్జీ షీట్ విడుద‌ల చేయ‌డం జ‌రిగిందని, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు మా సమాధానం అని రాసుకొచ్చారు.

ఏడాది పాల‌న‌.. బుడిదైన వంచ‌న‌ అంటూ.. వంచ‌న కేసీఆర్ కుటుంబ పెటెంట్ అని, వారికి త‌ప్ప వంచ‌న ఎవ‌రికీ సాధ్యం కాదని ఆరోపణలు చేశారు. మా ఏడాది పాల‌న‌లో కేసీఆర్ కుటుంబ వంచ‌న నుంచి ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌ల్పిస్తున్నామని, చెట్టుపేరు చెప్పి కాయ‌ల‌మ్ముకునే బాప‌తు బీఆర్ఎస్ పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ సెంటిమెంట్ తో ప‌దేండ్లు అధికారం అనుభ‌వించి, ఇచ్చిన హ‌మీల‌ను తుంగ‌లో తొక్కి ఇప్పుడు చార్జీషీట్ విడుద‌ల చేయ‌డం అంటే దొంగే దొంగ అన్న‌ట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే తొమిద‌న్న‌ర బీఆర్ఎస్ పాల‌న‌లో అడుగ‌డుగునా వంచ‌నే అని, ఎన్నో హ‌మీలిచ్చి గాలికి వ‌దిలేసారని విమర్శలు చేశారు. ఈ సందర్భంగా గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. ఎన్నో హ‌మీలిచ్చి ప్ర‌జ‌ల‌ను బీఆర్ఎస్ మోస‌గించిందని అన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బుద్ది చెప్పి, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో గుండు సున్నా ఇచ్చారని, అయినా దొర‌ దురాహంకారంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మేము బీఆర్ఎస్ భాష‌లోనే స‌మాధానం చెప్ప‌గ‌లమని, కాని మాకు సంస్కారం అడ్డోస్తుందని, మూర్ఖుల‌కు మాట‌లెక్కువ.. విజ్ఞుల‌కు క‌ట్టుబాట్లెక్కువ‌... విజ్ఞులం కాబ‌ట్టే మాట‌ల క‌న్నా చేత‌ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని సురాష్ట్రంగా మార్చే మా సంక‌ల్పాన్ని దెబ్బ‌తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారని, అయినా తాటాకు చ‌ప్పుళ్ల‌కు వెరిసేది లేదని, ఇచ్చిన హ‌మీల‌ను అమ‌లు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇక బీజేపీ స‌క్క‌ద‌నం చూస్తే బీఆర్ఎస్ తీరుగానే ఉందని, దేశంలో వారు ఇచ్చిన హ‌మీల‌ను గాలికి వ‌దిలేసి ఇప్పుడ గాలి మాట‌లు చెబుతున్నారని, బీజేపీ నేత‌లు ఒక్క సారి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాలన్నారు. 2014, 2019, 2024 ఎన్నిక‌ల ప్రణాళిక‌లో ఇచ్చిన హ‌మీల‌ను ఏ మేర అమ‌లు చేసారో శ్వేత ప‌త్రం విడ‌ద‌ల చేయాలని సామా డిమాండ్ చేశారు.

Next Story