- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T BJP: టీబీజేపీ చీఫ్ ఎంపికపై వీడని సస్పెన్స్.. ఎంపిక మరింత ఆలస్యం!
బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ ప్రకటన ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ ప్రకటన ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక తర్వాతే స్టేట్ చీఫ్ ఎన్నికపై స్పష్టత రానున్నది. అయితే జాతీయ అధ్యక్షుడి ఎన్నికను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. ఎన్నికను పూర్తి చేసి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు, కార్యకలాపాలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు ఎవరు ఉండాలనే దానిపై మూడు రోజులుగా పార్టీ అగ్రనేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్అధినాయకత్వంతోనూ మీట్ అయ్యి స్పష్టత తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఆ ఇద్దరు..
జాతీయ అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్మాజీ సీఎం శివరాజ్సింగ్చౌహన్, కేంద్ర మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్లాల్ఖట్టర్పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే చివరి నిమిషంలో ఏమైనా మార్పులు, చేర్పులు జరిగితే తప్ప ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది.






