మహిళామణులకు తీపి కబురు.. పంపిణీకి 50 లక్షల ఇందిరమ్మ చీరలు రెడీ

by Kema Shiva Kumar |

విజయ దశమి (దసర) సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.

మహిళామణులకు తీపి కబురు.. పంపిణీకి 50 లక్షల ఇందిరమ్మ చీరలు రెడీ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ దశమి (దసర) సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 23 నుంచి చీరల పంపిణీ కార్యక్రామాన్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసి మంత్రులు అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. అయితే, మొదట ఒక్కరికి రెండు చీరలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ ప్రస్తుతం దసరా పండుగకు ఒకటి, జనవరి‌లో సంక్రాంతికి మరోకటి ఇవ్వాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇదే ఏడాది ఫిబ్రవరిలో రూ.480 కోట్ల అంచనా వ్యయంతో ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 50 లక్షల చీరల తయారీ పూర్తి కాగా మరో 10 లక్షల చీరల ఉత్పత్తి పెండింగ్‌లో ఉంది. ఒక్కో చీర తయారీకి రూ.800 వరకు ఖర్చు అయినట్లుగా అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సెర్ప్, మెప్మా సంస్థలు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేశాయి. మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే చీరలు లైట్ బ్లూ కలర్‌, డార్క్ బ్లూ అంచుతో తయారు చేశారు. బ్లూ కలర్‌తో ఉన్న ఈ చీరల మీద తెల్లని రంగు పువ్వులను ముద్రించారు. కాగా, చీర బ్లౌజ్‌తో కలిపి 6.3 మీటర్లు ఉండనుంది. సీనియర్‌ సిటిజన్‌ మహిళలకు బ్లౌజ్‌ పీస్‌తో కలిపి 9 మీటర్ల చీరను పంపిణీ చేయనున్నారు.

Next Story