సంక్రాంతి వేళ ప్రయాణికులకు తీపికబురు.. అదనంగా 8 ప్రత్యేక రైళ్లు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-07 13:41:52  IST  )

సంక్రాంతి పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకున్నది.

సంక్రాంతి వేళ ప్రయాణికులకు తీపికబురు.. అదనంగా 8 ప్రత్యేక రైళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు 8 అదనపు ప్రత్యేక రైళ్లను నడపాలని డిసైడ్ అయ్యారు. ఈ రైళ్లు హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్, విజయవాడ మధ్య అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. అందులో ట్రైన్ నెంబర్ 07469 హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే రైలును మొత్తం నాలుగు ట్రిప్పులు నడుపనున్నారు. జనవరి 9, 10 తేదీల్లో (శుక్ర, శనివారాల్లో) ఉదయం 07:55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 02.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇక ట్రైన్ నెంబర్ 07470 సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు జనవరి 9, 18 తేదీల్లో (శుక్ర, ఆదివారాల్లో) మధ్యాహ్నం 15:15 గంటలకు బయలుదేరి రాత్రి 10:20 గంటలకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం, ఘన్‌పూర్, కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

ఇక ట్రైన్ నెంబర్ 07471 హైదరాబాద్ నుంచి విజయవాడ రైలును మొత్త నాలుగు ట్రిప్పులు నడుపనున్నారు. జనవరి 9, 10 తేదీల్లో (శుక్ర, శనివారాల్లో) ఉదయం 06:10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 01:40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. అదేవిధంగా ట్రైన్ నెంబర్ 07472 విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రైలు జనవరి 9, 18 తేదీల్లో (శుక్ర, ఆదివారాల్లో) మధ్యాహ్నం 02:40 గంటలకు బయలుదేరి రాత్రి 10:35 గంటలకు గమ్య స్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, ఘన్‌పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మానుకోట (మహబూబాబాద్), డోర్నకల్, ఖమ్మం, మధిర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

Next Story