కాంగ్రెస్ లోకి స్వామి గౌడ్?.. రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేత భేటీ

by Disha Web Desk 13 |
కాంగ్రెస్ లోకి స్వామి గౌడ్?.. రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేత భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో:మండలి మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత స్వామి గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ రాజకీయంగా చర్చకు దారి తీసింది. సోమవారం ఉదయం ఆయన సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు వారాల క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపిన స్వామి గౌడ్ అనూహ్యంగా ఇవాళ సీఎం వద్ద ప్రత్యక్షం కావడంతో ఆయన కండువా మార్చేందుకు ఫిక్స్ అయ్యారా అనే టాక్ జోరందుకుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడం, ప్రస్తుతం బీఆర్ఎస్ పై అధికార పక్షం ముప్పెట దాడి చేస్తున్న తరుణంలో స్వామిగౌడ్ అడుగులు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

అంతరార్థం అందేనా?:

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ మ్యూచువల్లీ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్న స్వామి గౌడ్ ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి సీఎం వద్దకు వెళ్లారు. టీఎన్జీ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, సొసైటీ కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్), యూనియన్ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ లతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి ప్రత్యేకంగా 20 కోట్లు మంజూరు చేయాలని, హౌసింగ్ సొసైటీ రెండో ఫేస్ రిజిస్ట్రేషన్ అనుమతి ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం త్వరలోనే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ అని పైకి చెప్పబడుతున్నప్పటికీ స్వామిగౌడ్ తరచూ కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లడం మాత్రం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. రెండు వారాల క్రితం స్వామిగౌడ్ నివాసానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. అక్కడ కాసేపు చర్చించిన ఈ ఇద్దరు అనంతరం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వద్దకు వెళ్లారు. దీంతో ఒకే సమాజాకి వర్గానికి చెందిన స్వామిగౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ లు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం బలంగా వినిపించింది. ఈ క్రమంలో ఇవాళ స్వామిగౌడ్ నేరుగా సీఎంతో భేటీ కావడం గులాబీ పార్టీలో ఏం జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

Also Read..

రాహుల్ గాంధీ వద్ద మార్కులు కొట్టేసిన సీఎం రేవంత్ రెడ్డి! ఎందుకో తెలుసా?

Next Story

Most Viewed