రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పేర్లు ఖరారు

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-05 03:20:29  IST  )

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభ్యర్థులుగా కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరి పేర్లను ఖరారు చేసింది.

రాజ్యసభ అభ్యర్థిత్వాలపై వీడిన సస్పెన్స్.. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ పేర్లు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఏఐసీసీ (AICC) కోటాలో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి అవకాశం కల్పించగా, రాష్ట్ర కోటాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రేపు వారిద్దరూ అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొననున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం దృష్ట్యా వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

Next Story