- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. మహా గఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్
బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మహా గఠ్‌బంధన్ (Grand Alliance) కూటమి నుంచి కీలక ప్రకటన వెలువడింది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మహా గఠ్‌బంధన్ (Grand Alliance) కూటమి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) పేరును కాంగ్రెస్ నేతల అశోక్ గెహ్లోత్ (Ashok Gehlot) అధికారికంగా ప్రకటించారు. ఇవాళ హోటల్ మౌర్యాలో జరిగిన ఐక్య సమావేశంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెల్లాట్, తేజస్వీ యాదవ్, వైసీపీ చీఫ్ ముకేష్ సహానీ, సీపీఐ(ML) జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, బిహార్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కృష్ణ అల్లవరు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశోక్ గెల్లాట్ మాట్లాడుతూ.. తేజస్వీ యాదవ్ యువకుడు, కాంగ్రెస్ సిద్ధంతాలకు కట్టుబడి పని చేస్తాడని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే సత్తా అతడికే ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో తేజస్వీ యాదవ్‌కు సుదీర్ఘ భవిష్యత్తు ఉందని అన్నారు. అందుకే బిహార్‌లో విపక్షాలు ఏకమై మహా గఠ్‌బంధన్‌గా ఏర్పడి తేజస్వీ నాయకత్వంలో ఎన్నికలు పోరాతున్నామని అన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా వైసీపీ (వికాస్ హీల్ పార్టీ) అధ్యక్షుడు ముకేష్ సహానీ పేరును ఆయన వెల్లడించారు. అదేవిధంగా మరో ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం తేజస్వీ యాదవ్ సమావేశంలో మాట్లాడుతూ తనను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్న అన్ని మిత్రపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మహా గఠ్‌బంధన్ బిహార్‌ను పునర్నిర్మించడానికి కలిసి పనిచేస్తుందని తెలిపారు. ‘జీవికా దీదీలు’కు ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ.30 వేల వేతనం వంటి సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. ‘చలో బిహార్, బదలేన్ బిహార్’ ఈ ఎన్నికల్లో తమ నినాదమని సీఎం అభ్యర్థి తేజస్వీ అన్నారు. కాగా, బిహార్‌లో నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు.






