మళ్లీ కోర్టుకెళతాం.. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కుటుంబ సభ్యుల సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |

మావోయిస్టు(Maoist) అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) మృతదేహం అప్పగింతపై సస్పెన్స్ వీడటం లేదు.

మళ్లీ కోర్టుకెళతాం.. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కుటుంబ సభ్యుల సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు(Maoist) అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) మృతదేహం అప్పగింతపై సస్పెన్స్ వీడటం లేదు. మృతదేహం కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఆయన బంధువులు ఎదురుచూస్తున్నారు. నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్‌ను ఛత్తీస్‌గఢ్ అధికారులకు(Chhattisgarh Officials) కేశవరావు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు. అయినా డెడ్‌బాడీని అప్పగించడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే తాము కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని అప్పగించకపోతే.. సోమవారం కోర్టు ధిక్కరణ కేసు వేయాలని కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు.. నంబాల కేశవరావు మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించాలని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆదివాసీల సంపదైన అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించాయి. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులను ఆపరేషన్‌ కగార్‌ పేరిట హతమారుస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. నంబాల కేశవరావు ఒడిశాలో చికిత్స పొందుతున్న సమయంలో పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చిచంపారని ఆరోపించారు. తక్షణమే ఆయన మృతదేహాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు.

Next Story