- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాఖ కేటాయింపుపై కొనసాగుతోన్న సస్పెన్స్..! హోంశాఖే కావాలని అజార్ పట్టు
రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు అయ్యింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు అయ్యింది. ఇంతవరకు ఆయనకు ఏ శాఖా కేటాయించ లేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి అదే రోజు లేదా మరుసటి రోజు శాఖల కేటాయింపులు జరుగుతాయి. మంత్రివర్గంలోకి తీసుకునే ముందే ఏ శాఖలు కేటాయించాలనే ఒక అంచనాకు ముఖ్యమంత్రి వస్తారు. ఇది సహజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగే విషయం. అయితే, అజారుద్దీన్విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి రెండు రోజులు గడచినా ఏ శాఖా కేటాయించలేదు. తనకు హోంశాఖ కావాలని, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింకు హోంశాఖ ఇచ్చిందని.. ఇప్పుడు తనకు కూడా హోంశాఖ ఇచ్చి ప్రాధాన్యత కల్పించాలని అజారుద్దీన్పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఏఐసీసీ ముఖ్యుల ద్వారా ఆయన సీఎం రేవంత్‌పై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం.
క్రీడలు, మైనార్టీ శాఖకే సర్కారు మొగ్గు..
కొత్త మంత్రి అజారుద్దీన్‌కు క్రీడలు, మైనార్టీ సంక్షేమం, అవసరమైతే మరో శాఖ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ప్రతిపాదించినట్టు సమాచారం. దీనికి అజారుద్దీన్ విముఖంగా ఉన్నట్లుగా తెలిసింది. దీంతో శాఖల కేటాయింపు ఆగిపోయిందని సమాచారం.పార్టీలో అనేక మంది ముఖ్యులు ఉన్నారని, సామాజిక సమీకరణాలు, ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కీలకమైన హోంశాఖ ఇవ్వడం కుదరదని చర్చ జరుగుతోందని తెలిసింది. ఈ క్రమంలోనే శాఖల కేటాయింపు మరింత ఆలస్యం కావొచ్చని సమాచారం.
మైనార్టీ వర్గాల ఎదురుచూపులు..
జూబ్లీహిల్స్ఉపఎన్నిక ప్రచారం ఊపందుకున్న తరుణంలో అజారుద్దీన్మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారని మైనార్టీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి వచ్చినా ఇంతవరకు ఏ శాఖ కేటాయించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ఎన్నికల వేళ వీలైనంత త్వరగా శాఖ కేటాయించి సరికొత్త చర్చకు అస్కారం లేకుండా, మైనార్టీలకు కాంగ్రెస్‌పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని, ఉభయసభల్లో దేనిలోనూ సభ్యుడు కాకపోయిన మంత్రి పదవి కేటాయించామనే విషయాన్ని మైనార్టీ వర్గాల్లోకి తీసుకపోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర హోంశాఖ, మున్సిపల్, విద్యాశాఖ, వాణిజ్య పన్నులు తదితర కీలక శాఖలు ఉన్నాయి. అజారుద్దీన్‌కు ఇస్తామంటున్న క్రీడాశాఖ ప్రస్తుతం వాకిటి శ్రీహరి వద్ద ఉంది. మైనార్టీ సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్వద్ద ఉన్నది. వారిద్దరి నుంచి ఆ శాఖలను తొలగించి అజారుద్దీన్కుకేటాయించే చాన్స్ ఉంది. శాఖలు కోల్పోయే మంత్రులకు ఇతర శాఖలు కేటాయించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.






