Ponguleti: భూభారతి చట్టం సయమంలో సీఎం రేవంత్ రెడ్డి నిద్రలేని రాత్రులు: మంత్రి పొంగులేటి

by Prasad Jukanti |

వచ్చే ఉగాది నాటికి 7 వేల లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు అందుబాటులోకి రాబోతున్నారని పొంగులేటి చెప్పారు.

Ponguleti: భూభారతి చట్టం సయమంలో సీఎం రేవంత్ రెడ్డి నిద్రలేని రాత్రులు: మంత్రి పొంగులేటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా భూ భారతి చట్టం తయారు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ధరణి స్థానంలో అద్భుతమైన భూభారతి (Bhu Bharthi) చట్టాన్ని తీసుకువచ్చామని ఈ చట్టం చేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిద్రలేని రాత్రులు గడిపారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్ లో జీపీవోలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి చట్టానికి విధివిధానాలు రూపొందించలేదని కానీ మేమొచ్చాక పేదవాడి భూములకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధరణి ద్వారా ఏర్పడిన సమస్యలను గత ప్రభుత్వం పరిష్కరించలేదని మా ప్రభుత్వంలో అధికారులే ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. చెప్పిన మాట వినలేదని గత ప్రభుత్వాధినేత గ్రామ రెవెన్యూ వ్యవస్థను రోడ్డున పడేసిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల లైసెన్స్డ్ సర్వేయర్లను వచ్చే ఉగాది నాటికి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయబోతున్నామన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన గ్రామపాలన అధికారులతో పారదర్శకంగా, నిబద్ధతతో, న్యాయబద్ధంగా పని చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

Next Story