డ్రగ్స్ నియంత్రణపై నిఘా

by Yella Dhawani Reddy |

డ్రగ్స్ నియంత్రణపై నిరంతరం నిఘా ఉంచాలని సీపీలు, ఎస్పీలు ఈ విషయంలో పూర్తి స్థాయిలో పని చేయాలని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు.

డ్రగ్స్ నియంత్రణపై నిఘా
X

దిశ, తెలంగాణ బ్యూరో: డ్రగ్స్ నియంత్రణపై నిరంతరం నిఘా ఉంచాలని సీపీలు, ఎస్పీలు ఈ విషయంలో పూర్తి స్థాయిలో పని చేయాలని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణపై ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్ధుల సహకారంంతో ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం హఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీసింగ్‌లో సాంకేతికత ప్రాముఖ్యతను తెలుపుతూ సీసీటీఎన్ఎస్ ప్రాజెక్ట్ వినియోగాన్ని వివరించారు. ఈ-సమ్మన్స్ వ్యవస్థను స్వీకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీజీ సీఐడీ శిఖా గోయల్ మాట్లాడుతూ చట్ట అమలు, ప్రజా భద్రతకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తవించారు. శాంతిభద్రతల సమస్యలపై వివరణాత్మక ప్రజెంటేషన్, నకిలీ విత్తనాల నియంత్రిణపై వ్యూహాలపై ఏడీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ మాట్లాడారు. ఈ సమావేశంలో ఏడీజీపీ వీవీ శ్రీనివాసరావు, మహిళా భద్రతా విభాగం డీఐజీ రెమా రాజేశ్వరి, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ వెంకట అప్పల నాయుడు , ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ ఎస్.సాంబశివ రెడ్డి, టీఎస్ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, డీసీపీ సీసీఎస్ శ్వేతారెడ్డి,అదనపు డీజీపీ (పర్సనల్) అనిల్ కుమార్, ఏడీజీపీ స్వాతి లక్రా, ఐజీపీ (పీ అండ్ ఎల్) ఎం.రమేష్ ఐపీఎస్ ఐజీపీలు వి.వి.సత్యనారాయణ, ఎస్.చంద్రశేఖర్ రెడ్డి పోలీసు సిబ్బంది సంక్షేమం గురించి మాట్లాడారు.

Next Story