- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం కమ్ముకొని ఉంది. దీంతో అనేక జిల్లాలో గత రెండు రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం (Surface circulatio) కమ్ముకొని ఉంది. దీంతో అనేక జిల్లాలో గత రెండు రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తెలంగాణలోని 11 జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఈ రోజు కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. మరో రెండు గంటల్లో తెలంగాణలోని కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి లో ఉరుములతో కూడిన తుఫాను (Thunderstorm) లాంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Department of Meteorology) అంచనా వేసింది. అలాగే గద్వాల్, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్‌లలో తదుపరి 2 గంటల తర్వాత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ - తదుపరి 2-3 గంటలు పొడిగా ఉంటుందని, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఉరుములతో కూడిన తుఫానులు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
Read More..






