- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా సురేష్ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) ఉపాధ్యక్షునిగా పెరిక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీఓఏ) ఉపాధ్యక్షునిగా పెరిక సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ బోట్ క్లబ్‌లో ఎస్.ఆర్. ప్రేమ్‌రాజ్ అధ్యక్షతన జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో సురేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్‌గా, విజేందర్ సింగ్ జాయింట్ సెక్రటరీగా, సురేందర్ జోసెఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడలను మెరుగుపరచడం, అథ్లెట్ల సంక్షేమం కోసం అసోసియేషన్ చేపట్టే కృషిని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఒలింపిక్ స్ఫూర్తిని ప్రోత్సహించడం, రాష్ట్రాన్ని, జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చేలా కృషి చేస్తామని సురేష్ తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, జనరల్ సెక్రటరీ బాబూరావు, ట్రెజరర్ శివశంకర్ తుమ్కూర్ హాజరై అభినందించారు.






