‘సురవరం’ కుటుంబం గొప్ప నిర్ణయం.. మొత్తం ఆస్తి ప్రజలకు పంపిణీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-01 12:30:06  IST  )

దివంగత కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది.

‘సురవరం’ కుటుంబం గొప్ప నిర్ణయం.. మొత్తం ఆస్తి ప్రజలకు పంపిణీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. వారి ఆస్తిని ప్రజలకు పంచివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సురవరం సుధాకర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి(Vijayalakshmi) ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనపై కమ్యూనిస్టు నేతలు స్పందించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి, నాలుగున్నర ఎకరాల భూమిని ప్రజా- యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని అని కమ్యూనిస్టు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సురవరం బతికి ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు. చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు.

ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా ప్రజల కోసం ఇచ్చారని కొనియాడుతున్నారు. ఇది కేవలం కమ్యూనిస్టు నాయకులకే సాధ్యమవుతుందని అన్నారు. నేటి యువతరానికి సురవరం కుటుంబం స్ఫూర్తి, ఆదర్శమని అన్నారు. కాగా, ఇటీవల అనారోగ్యంతో సురవరం సుధాకర్‌ రెడ్డి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. 1998, 2004 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ స్థానం ఎంపీగా నుంచి ఎన్నికయ్యారు. ఏఐఎస్‌ఎఫ్‌ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. మూడు దఫాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Next Story