- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పలు కోర్సులకు తెలుగు యూనివర్శిటీ దరఖాస్తులకు ఆహ్వానం
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ సోమవారం విడుదల చేసింది.

- జూన్ 24 లోగా సాధారణ ఫీజు, 30 వరకు లేట్ ఫీజుతో అవకాశం
- యూనివర్శిటీ రిజిస్ట్రార్
దిశ, తెలంగాణ బ్యూరో: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ సోమవారం విడుదల చేసింది. వివిధ రెగ్యులర్ కోర్సుల వివరాలతో ప్రవేశ ప్రకటనను వెలువరించినట్లు యూనివర్శిటీ రిజిస్ట్రార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు యూనివర్శిటీ నిర్వహించే శిల్పం-చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, శాస్త్రీయ న్రుత్యం(కూచిపూడి, ఆంధ్రనాట్యం), జానపదం, తెలుగు, చరిత్ర-పర్యాటకం, భాషా శాస్ర్తం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా కోర్సుల కొరకు ఎంఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రొగ్రాంలలో అర్హత కలిగిన, ఆసక్తి కలిగిన విద్యార్థులు యూనివర్శిటీ ఆన్లైన్ ద్వారా ధరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.teluguuniversity.ac.in లేదా www.pstucet.org వెబ్ సైట్ లను సందర్శించాలని సూచించారు. పూర్తి చేసిన ధరఖాస్తులను జూన్ 24 లోగా సాధారణ ఫీజుతో జూన్ 30 వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామని యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.






