తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి సురవరం.. జయంతి వేళ హరీశ్‌రావు నివాళులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-01 06:15:07  IST  )

తెలంగాణ రాష్ట్రం గర్వించదగిన వ్యక్తి సురవరం ప్రతాప రెడ్డి అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు.

తెలంగాణ గర్వించదగిన గొప్ప వ్యక్తి సురవరం.. జయంతి వేళ హరీశ్‌రావు నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం గర్వించదగిన వ్యక్తి సురవరం ప్రతాప రెడ్డి అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. సోషల్ మీడియా (Social Media)లో ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ట్విట్ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా అని అన్నారు. తెలంగాణ (Telangana)పై వివక్షను ఆనాడే ఎదిరించి గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణ సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి సురవరం అని కొనియాడారు. రాష్ట్రం గర్వించదగిన గొప్ప వ్యక్తి.. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో సురవరం స్పూర్తి ఇమిడి ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు వారి చరిత్ర తెలిసేలా వారి జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాడు సీఎంగా కేసీఆర్ (KCR) నిర్ణయించారని గుర్తు చేశారు. సురవరం సేవలకు గుర్తుగా ఆయన పేరుతో పలు రంగాలకు చెందిన ప్రముఖులకు గౌరవ పురస్కారాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అందించామంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.

Next Story