- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-1 పై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపు గా భావిస్తున్నానన్నారు. రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను నిన్న సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పును సమర్ధించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి..కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి, కన్నవారి కష్టం పై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్ -1 ఆశావహులకు ఇది పెద్ద ఊరట అన్నారు.
దుష్ట శక్తుల కుట్రలను ఛేదించాం:
ప్రజా ప్రభుత్వం వచ్చీరావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసిందన్నారు. ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించి, రాష్ట్ర పునర్ నిర్మాణంలో తొలి గ్రూప్ -1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశామన్నారు. ఉద్యోగాలను ఎంపికైన వారికి మరో సారి నా అభినందనలు అని తెలిపారు. ప్రభుత్వం ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించామన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపాుర.






