Supreme Court: కోర్టుల్లో రాజకీయాలొద్దు.. ‘ఓట్‌చోరీ’ పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-10-13 08:59:11  IST  )

రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోరీ ఆరోపణలై దాఖలైన పిల్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Supreme Court:  కోర్టుల్లో రాజకీయాలొద్దు.. ‘ఓట్‌చోరీ’ పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి హాట్ కామెంట్స్ చేసింది. వీటికోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఓట్‍చోరీ (Vote Chori) ఆరోపణలపై సిట్ విచారణ జరిపించాలని కోరుతూ రోహిత్ పాండే అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‍ను విచారించేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలా బాగ్చిలతో కూడిన దర్మాసనం ఈ పిల్‍ను విచారించేందుకు నిరాకరించింది. అలాగే ఈ విషయంలో ఈసీఐని ఆశ్రయించాలని పిటిషన్‍కు సూచించింది. అయితే తాను ఈసీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ ఎలాంటి చ ర్యలు తీసుకవడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. దీంతో రాజకీయ అంశాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోంచారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించిన ఆయన ఓట్ చోర్-గద్దీ ఛోడ్ అనే నినాదంతో ఓటర్ అధికార్ యాత్రను సైతం చేపట్టారు.

Next Story