- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. స్పీకర్ గడ్డం ప్రసాద్‍కు సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‍కు (Gaddam Prasad Kumar) సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో కోర్టు ఆదేశాలను స్పీకర్ దిక్కరించారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‍రెడ్డి (Alleti Maheshwar Reddy) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఏడుగురికి ఇటీవల స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏలేటి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఈ అంశంలో సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. అలాగే ఏలేటి పిటిషన్‍ను ఇదే అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తో జతచేస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.






