- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అక్టోబర్ 8 కి విచారణ వాయిదా
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు సహకరించాలని సుప్రీంకోర్టు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావుకు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: (phone tapping case) ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు సహకరించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం సోమవారం విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు సహకరించడం లేదని ప్రభుత్వం తరపు అడ్వకేట్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddhartha Luthra), సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వివరించారు.
మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంటెరిమ్ ప్రోటెక్షన్ తో జూలై 9 సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారని, మూడు నెలలు గడుస్తున్న విచారణకు సహకరించడం లేదని వివరించారు. కేసుకు సంబంధించి ప్రస్తుత స్టేటస్ రిపోర్టును దాఖలు చేసినట్లు కోర్టుకు వివరించారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సాక్షాధారాలు ట్యాంపరింగ్ చేశారని సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు వివరించారు. డేటా రికవరీ చేయడానికి కూడా ప్రభాకర్ రావు సహకరించడం లేదన్నారు. ఆయన ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఫార్మాట్ చేసి ఇచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ప్రభాకర్ ఇప్పటికే 15 సార్లు విచారణకు హాజరయ్యారని, (Prabhakar Rao) ప్రభాకర్ రావు తరపున సీనియర్ అడ్వకేట్ దామా శేషాద్రి నాయుడు కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.






