- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావు బెయిల్ వ్యవహారంపై విచారణ వాయిదా
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ వ్యవహారం పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన (phone tapping case) ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ వ్యవహారం పై (Supreme Court) సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ప్రభాకర్‌రావు (Prabhakar Rao) ముందస్తు బెయిల్ (anticipatory bail) రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇవాళ సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ధర్మాసనానికి తెలిపారు. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 25 కి వాయిదా వేసింది. ఇక తదుపరి విచారణ పూర్తి అయ్యే వరకు ముందస్తు బెయిల్ కొనసాగుతోందని ధర్మాసనం తెలిపింది.
Next Story






