- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
by Sathputhe Rajesh |
కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదానికి సంబంధించిన కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదానికి సంబంధించిన కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేసును జనవరికి వాయిదా వేసింది. కాగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీ చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కృష్ణా ట్రిబ్యునల్‌కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్‌పై గత విచారణలో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ కోరడంతో విచారణ వాయిదా వేసింది.
Next Story






