- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
భూ ఆక్రమణ వివాదంలో ఉన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఆదేశాలతో ఊరట లభించినట్లయింది.

దిశ, తెలంగాణ బ్యూరో : భూ ఆక్రమణ వివాదంలో ఉన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఊరట లభించినట్లయింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను రాష్ట్ర హై కోర్టు కొట్టివేయడంతో జీవన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. మొయినాబాద్ వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో ఆయనకు సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశాలు జారి చేసింది. జీవన్ రెడ్డి తరపు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తెలంగాణ హై కోర్టు బెయిల్ మంజూరు చేసిందని వివరించారు. వాదనలు పరిశీలించిన జస్టిస్ పార్థవాలా ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తునకు సహకరించకపోతే విచారణాధికారులు తగిన చర్యలు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.






