Mani Sharma: హెచ్ సీయూ భూముల వివాదం.. నిరసనకు మద్దతుగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్

by Prasad Jukanti |   (  Updated:2025-04-01 07:34:57  IST  )

హెచ్ సీయూ భూముల ఆందోళన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది.

Mani Sharma: హెచ్ సీయూ భూముల వివాదం.. నిరసనకు మద్దతుగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్ సీయూ (HCU) సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli Lands) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు తాజాగా రాజకీయ పార్టీలు జతకలవడంతో సిట్యుయేషన్ మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. ఈ క్రమంలో హెచ్ సీయూ భూముల విషయంలో తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ (Music Director Mani Sharma) నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కేబీఆర్ పార్క్ వద్ద హెచ్ సీయూ భూముల విషయంలో బీఆర్ఎస్వీ (BRSV) నిరసన వ్యక్తం చేయగా సేవ్ ట్రీస్ అనే ఫ్లకార్డును పట్టుకుని మణిశర్మ వారికి మద్దతు తెలిపారు. అయితే కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించగా ఇప్పుడీ ఇష్యూలోకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

Next Story