- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నార్కెట్‌పల్లి- అడ్డంకి రహదారి పనుల పర్యవేక్షణ.. రూ. 8.70 కోట్లు నిధులు మంజూరు
నార్కెట్‌పల్లి-అడ్డంకి-మేదరమెట్ల రహదారి విస్తరణ, నిర్వహణ పనుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: నార్కెట్‌పల్లి-అడ్డంకి-మేదరమెట్ల రహదారి విస్తరణ, నిర్వహణ పనుల పర్యవేక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ పరిధిలో ఉన్న రహదారి నిర్వహణ, పెండింగ్‌లో ఉన్న పనులను పర్యవేక్షించేందుకు ఇండిపెండెంట్ ఇంజనీర్ సేవలను మరో మూడేళ్ల పాటు పొడిగించారు. న్యూఢిల్లీకి చెందిన మెసర్స్ లీ అసోసియేట్స్ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ పనులను పర్యవేక్షిస్తుంది.
ఏప్రిల్ 30, 2028 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవల కోసం ప్రభుత్వం మొత్తం రూ. 8.70 కోట్లకు సవరించిన పరిపాలనా అనుమతులను ఇచ్చింది. ఇందులో గతంలో మంజూరు చేసిన రూ. 4.80 కోట్లతో పాటు, అదనంగా రూ. 3.89 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.ఈ ప్రాజెక్టు వ్యయంలో తెలంగాణ వాటా 41.088 శాతంగా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన ఈ రహదారి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నాణ్యతను నిర్ధారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.






