- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సున్నం చెరువు చుట్టూ సర్వే చక్రం.. అభివృద్ధికి ఆంక్షల ముసురు
సున్నం చెరువు అభివృద్ధి విషయంలో అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

దిశ, శేరిలింగంపల్లి : సున్నం చెరువు అభివృద్ధి విషయంలో అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 6 చెరువులను అభివృద్ధి చేసేందుకు హైడ్రా ప్రణాళికలు రూపొందించింది. అందులో సున్నం చెరువు ఒకటి.. కాగా ఈ చెరువు అభివృద్ధి విషయంలో మొదటి నుండి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మూడు పర్యాయాలుగా హైడ్రా ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ లో ఉన్న చెరువులను కూల్చివేసింది. దీనిపై పలువురు కోర్టుకు వెళ్లారు. హై కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 30లో సున్నం చెరువు 24 ఎకరాల 12 గుంటలు ఉన్నట్టు నిర్ధారణ అవగా.. ఎఫ్టీఎల్, బఫర్ బఫర్ జోన్ ల బౌండరీలను నిర్థారించకుండా సమీపంలోని సియెట్ సొసైటీలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో బౌండరీల గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. సర్వే అనంతరం రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులు హైకోర్టుకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. సర్వే నేపథ్యంలో సున్నం చెరువు వద్ద ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా భారీగా పోలీసులను మోహరించారు.






