- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : సుంకిశాల ఘటన విచారణ నివేదికను బహిర్గతం చేయాలి : కేటీఆర్
సుంకిశాల(Sunkishala) పంప్ హౌజ్ రిటైనింగ్ వాల్(Retaining wall) కూలిన ఘటన(Incident)పై విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : సుంకిశాల(Sunkishala) పంప్ హౌజ్ రిటైనింగ్ వాల్(Retaining wall) కూలిన ఘటన(Incident)పై విజిలెన్స్ విచారణ నివేదికను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కింద నివేదిక వివరాలను ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమని విమర్శించారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని.. దేశ రక్షణకు సంబంధించిన సమాచారహక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మేఘా సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలనే కమిటీ రిపోర్ట్ ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డికి, మేఘా కృష్ణారెడ్డిలకు మధ్య కుదిరిన చీకటి ఒప్పందమేనని ఆరోపించారు.
సుంకిశాలలో మేఘా సంస్థ నిర్లక్ష్యం వల్ల రిటైనింగ్‌వాల్ కూలి రూ. 80 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందన్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడిందన్నారు. నిర్మాణ లోపం బయట పడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కారు జంకుతోందని..సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పును ఒప్పుకున్నట్టేనని కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని..తన జేబు సంస్థగా మార్చుకుని ఢిల్లీ పెద్దల ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు.
బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి రూ.4,350 కోట్ల కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును (Quid pro Quo) కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెరతీశారని కేటీఆర్ మరోసాకి కీలక ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను మానుకోవాలని, సుంకిశాల ఘటనపై ప్రభుత్వం చేపట్టిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
నాగార్జున సాగర్ లో 510అడుగులకన్నా తగ్గితే హైదరాబాద్ కు నీటి తరలింపులో ఇబ్బంది తలెత్తకుండా డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని తరలించడం ద్వారా 50ఏండ్ల పాటు జంటనగర వాసులకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుంకిశాల ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. నల్లగొండ జిల్లా పెద్దవూరా మండలం పాల్తితండా సుంకిశాల గట్టు వద్ధ పంప్ హౌజ్ నిర్మించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 2021మార్చి 16న రూ.1450కోట్ల అంచనా వ్యయంతో పంప్ హౌజ్ నిర్మాణ పనులను మెఘా ఇంజనీరింగ్ సంస్థకు కేటాయిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. జలమండలి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. 2022ఆక్టోబర్ లో రూ.2,214కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారు.
నాగార్జున సాగర్ జలాశయం నుంచి 455 అడుగుల నుంచి, 504అడుగుల నుంచి, 547అడుగుల నుంచి నీటిని తీసుకునేలా మూడు సొరంగాలు నిర్మిస్తున్నారు. సొరంగాల ద్వారా పంప్ హౌజ్ కు నీటిని తరలిస్తారు. సొరంగాల నుంచి వచ్చే నీటి తాకిడి పంప్ హౌజ్ లోకి చేరకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ నిర్మించారు. అయితే సాగర్ జలాశయానికి వచ్చిన భారీ వరదలకు ఒత్తిడి పెరిగి సొరంగం గేటు ధ్వంసమై రిటైనింగ్ వాల్ వైపు వరద దూసుకురావడంతో వాల్ ఆకస్మాత్తుగా కూలిపోయింది.
అదృష్టవశాత్తు ఆ సమయంలో కార్మికులు పనిలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినప్పటికి ఇంజనీరింగ్ తప్పిదాలతో వాల్ కూలిపోయి ఆర్థిక నష్టం మాత్రం వాటిల్లక తప్పలేదు. ఘటనకు బాధ్యులుగా నలుగురు జలమండలి ఇంజనీర్లను సస్పండ్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.






