Sunil Rao: ఆయనది పేకాట ఆడే సంస్కృతి.. ఎమ్మెల్యే గంగులపై సునీల్ రావు తీవ్ర ఆరోపణలు

by Kema Shiva Kumar |

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ (MLA Gangula Kamalakar)ది బ్యాంకాక్ (Bangkok), శ్రీలంక (Srilanka) దేశాలకు వెళ్లి పేకాట ఆడే సంస్కృతి అని కరీంనగర్ మేయర్ సునీల్ రావు (Sunil Rao) సంచలన ఆరోపణలు చేశారు.

Sunil Rao: ఆయనది పేకాట ఆడే సంస్కృతి.. ఎమ్మెల్యే గంగులపై సునీల్ రావు తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ (MLA Gangula Kamalakar)ది బ్యాంకాక్ (Bangkok), శ్రీలంక (Srilanka) దేశాలకు వెళ్లి పేకాట ఆడే సంస్కృతి అని కరీంనగర్ మేయర్ సునీల్ రావు (Sunil Rao) సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన, 10 మంది కార్పొరేటర్లు, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) సమక్షంలో బీజేపీ (BJP) కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రతీ స్కామ్‌ వెనుక గంగుల కమలాకర్ (Gangula Kamalakar) పాత్ర ఉందని ఆరోపించారు.

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి బ్యాంకాక్ (Bangkok), శ్రీలంక (Srilanka) దేశాలకు వెళ్లి పేకాట ఆడిన సంస్కృతి గంగులదని ఫైర్ అయ్యారు. అదేవిధంగా జిల్లాలో చెక్‌ డ్యామ్స్ (Check Dams), రోడ్డు కాంట్రాక్టర్లు (Road Contractors) అంతా ఆయన బినామీలేనని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అవినీతిని బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితోనే కరీంనగర్ అభివృద్ధి జరుగుతోందని కామెంట్ చేశారు. నగర అభివృద్ధి ఆగిపోవద్దనే తాను ఇంత కాలం సైలెంట్‌గా ఉన్నానని.. తాను ఏ విచారణకైనా సిద్ధమని మేయర్ సునీల్‌ రావు, గంగులకు సవాల్ విసిరారు.

Next Story