- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ వార్‌రూం కేసులో విచారణకు హాజరైన సునీల్ కొనుగోలు
కాంగ్రెస్ వార్‌రూం కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసులు ముందు విచారణకు కాంగ్రెస్ వ్యహకర్త సునీల్ కనుగొలు హాజరయ్యాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ వార్‌రూం కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసులు ముందు విచారణకు కాంగ్రెస్ వ్యహకర్త సునీల్ కనుగొలు హాజరయ్యాడు. సోమవారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో సైబర్‌క్రైం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. విచారణలో భాగంగా సునీల్ కనుగొలు స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. మొదట అనారోగ్య కారణాలతో రాలేనని సునీల్ కనుగోలు పోలీసులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చాడు. సునీల్ విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించడంతో కాసేపటికే విచారణకు హాజరయ్యాడు. ఈ కేసులో డిసెంబర్ 27వ తేదీన విచారణకు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద సునీల్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన 41ఏ నోటీసులను సవాల్ చేస్తూ సునీల్ కనుగొలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ జరిపిన ధర్మాసనం 41ఏ నోటీసులు పై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేఫథ్యంలో సైబర్ క్రైమ్ విచారణకు సహకరించాలని సునీల్ కనుగొలుకు హైకోర్టు ఆదేశించింది. విచారణ చేయాలి తప్ప, అరెస్ట్ చేయవద్దని పోలీసులకు కూడా హైకోర్టు ఆదేశించింది. కాగా, కాంగ్రెస్ వార్ రూమ్ కేంద్రంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించ పరిచేలా సోషియల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 41ఏ నోటీసులు ఇచ్చి, హైకోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేస్తున్నారు.






